పంట పోయింది ఆదుకోండి
ABN , First Publish Date - 2023-11-21T23:53:01+05:30 IST
తీవ్ర వర్షాభావంతో వరి పంట పాడైందని, ఆదుకోవాలని తిడ్డిమి గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కె.రవిచంద్రను కలిసి వినతిపత్రం అందించారు.

పాతపట్నం: తీవ్ర వర్షాభావంతో వరి పంట పాడైందని, ఆదుకోవాలని తిడ్డిమి గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కె.రవిచంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సం దర్భంగా రైతులు మాట్లాడుతూ.. మా గ్రామంలో వర్షాధార భూముల ని, ఈ ఏడాది తక్కు వగా వర్షాలు కురియడంతో తిడ్డిమి, చిన్న పద్మాపురం, గాటి మొగిల ప్పలపాడుల్లో నీరు లేక పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.