మార్కెట్‌కు వెళ్లొస్తానని చెప్పి...

ABN , First Publish Date - 2023-06-03T00:27:46+05:30 IST

మార్కెట్‌కు వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లిన నిమిషాల్లో ఆ వ్యాపారి దుర్మరణం పొందాడు.

మార్కెట్‌కు వెళ్లొస్తానని చెప్పి...
రోధిస్తున్న కుటుంబ సభ్యులు, శాంతారాం(ఫైల్‌)

- ఆర్టీసీ బస్సు కిందపడి వస్త్రవ్యాపారి దుర్మరణం

ఆమదాలవలస: మార్కెట్‌కు వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లిన నిమిషాల్లో ఆ వ్యాపారి దుర్మరణం పొందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణం పరిధి లక్ష్మీనగర్‌ కూడలి సమీపంలో నివాసం ఉంటున్న అమనాన శాంతారాం(75) దాదాపు 40 ఏళ్లుగా పట్టణంలో వస్త్ర దుకాణం నడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్ర మార్కెట్‌కు తన సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరి సుమారు 50 మీటర్లు వెళ్లాడో లేదో ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందాడు. హిరమండలం వైపు నుంచి వచ్చే బస్సులు రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణిలు దిగేటప్పుడు నిలుపుదల చేస్తుంటారు. ఇదే క్రమంలో ఆర్టీసీ బస్సు నిలిపారు. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత బస్సు ముందుకు తీస్తుండగా, ఇదే సమయంలో బస్సు పక్క (రైట్‌సైడ్‌) నుంచి సైకిల్‌పై వెళ్తున్న శాంతారాంను గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు తగిలిన శాంతారాం రైలింగ్‌కు బస్సుకు మధ్య పడిపోయాడు. శాంతారాం తల బస్సు చక్రాల కింద పడడంతో నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాపారులంతా అక్కడికి చేరుకోవడంతో అరగంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. డ్రైవర్‌ తవిటినాయడు అదుపులోకి తీసుకుని బస్సును స్టేషన్‌కు తరలించారు. ఈయనకు భార్య భారతి, ముగ్గురు కుమార్తెలు చార్మిళ, శిరీష, అనూష ఉన్నారు. వీరందరికీ వివాహాలయ్యాయి. ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో ఉండగా, చిన్న కుమార్తె అనూష పలాసలో ఉంటుంది. ఈమె ఇటీవలే కన్నవారి ఇంటికి వచ్చింది. అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వై.కృష్ణ కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజని ఆసుపత్రికి తరలించారు. వాస్త్ర వ్యాపారి శాంతారాం మృతి చెందడంతో ఆ సంఘ నాయకులు జలుమూరు వెంకటేశ్వరరావు, బాగాది భాస్కరరావు, పొట్నూరు సరేష్‌, కుసుమంచి శ్యామ్‌ ప్రసాద్‌ దిగ్బారంతి చెంది ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Updated Date - 2023-06-03T00:27:46+05:30 IST