టార్గెట్లతో వేధింపులు మానుకోవాలి

ABN , First Publish Date - 2023-02-21T23:52:27+05:30 IST

టార్గెట్‌లతో అధికా రులు వేధింపులు మానుకోవాలని ఎన్‌ఎఫ్‌సీఈ జీడీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.నందీశ్వరరావు అన్నారు. కాశీబుగ్గ పోస్టల్‌ కార్యాలయం ఆవరణలో పోస్టల్‌ ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు.

టార్గెట్లతో వేధింపులు మానుకోవాలి
నిరసన తెలుపుతున్న తపాలాశాఖ ఉద్యోగులు

కాశీబుగ్గ, ఫిబ్రవరి 21: టార్గెట్‌లతో అధికా రులు వేధింపులు మానుకోవాలని ఎన్‌ఎఫ్‌సీఈ జీడీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.నందీశ్వరరావు అన్నారు. కాశీబుగ్గ పోస్టల్‌ కార్యాలయం ఆవరణలో పోస్టల్‌ ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోస్ట ల్‌ డైరెక్టరేట్‌ ఆదేశాల మేరకు పీవోఎస్‌బీ మహా మేళా ఈనెల 20 నుంచి 24 వరకు అన్ని తపాలా కార్యాలయాల్లో 50 అకౌంట్‌లు చేయాలని ఒత్తిడి తెస్తున్నార న్నారు. అయితే ఇది సాధ్యం కాదని, టార్గెట్‌ విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వేధింపులు ఆపకుంటే మార్చి 9న విజయవాడలోని సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో సంఘ నాయకులు వేమన, తేజేశ్వరరావు, ప్రకాష్‌రావు, రాజేష్‌, దుర్యోధన, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:52:28+05:30 IST