ఘనంగా పెన్షనర్ల దినోత్సవం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:50 PM
జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
(ఆంధ్రజ్యోతి బృందం)
జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సమావేశాల్లో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్లు జమ చేయాలని సంఘ నాయకులు కోరారు. సీనియర్ పెన్షనర్లను సత్కరించారు.