ఘనంగా గె లీలియో జయంతి
ABN , First Publish Date - 2023-02-15T23:56:35+05:30 IST
మూఢనమ్మకాలను తొలగించడంలో గెలీలియో కీలకపాత్ర పోిషించారని ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీరాములు అ న్నారు.
శ్రీకాకుళం అర్బన్: మూఢనమ్మకాలను తొలగించడంలో గెలీలియో కీలకపాత్ర పోిషించారని ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీరాములు అ న్నారు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం భౌతిక శాస్త్రవేత్త గెలీలి యో జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలీలియో కాలం నాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసి గడియారాలు లేనప్పటికీ కాలాలను గణించడం గొప్పవిషయమన్నారు. భౌతికశాస్త్ర విభాగాతిపతి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. గెలీలియో తన ప్రయోగాల ద్వారా నాణ్యమైన టెలీస్కోప్ ను కనుగొన్నారన్నారు. ఈ సందర్భంగా గెలీలియో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పి.శంకర్‌నారాయణరావు, అకాడమీ కో ఆర్డినేటర్ సీహెచ్ కృష్ణారావు, ఎస్.పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.