Share News

బాబుతోనే ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’

ABN , First Publish Date - 2023-11-06T23:45:02+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు.

బాబుతోనే ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’
ఒరియా నారాయణపురంలో మాట్లాడుతున్న అశోక్‌

- ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కంచిలి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ అని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. సోమవారం ఒరియా నారాయణపురంలో బాబుతో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మినీ మేనిఫేస్టోను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు వైసీపీ పాలనలో చిన్నాభిన్నమయ్యాయన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మోసంచేస్తోందని ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన 10 మందికి హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు బంగారు కురయ్య, పార్టీ మండల కార్యదర్శి మాదిన రామారావు, నాయకులు జగదీష్‌ పట్నాయక్‌, తమరాల శోభన్‌, టీవీ రమణ, వాసాల రమేష్‌ రెడ్డి, పైల పురుషోత్తం రెడ్డి, కె.కురయ్య, మాదిన ప్రదీప్‌, ఆనంద్‌ బద్రి నాగేష్‌, గురిబిడ్డి మన్మథరావు, బుడ్డేపు భాస్కరరావు, బూరగాం అప్పారావు, బెందాళం రమేష్‌, త్రినాఽథ్‌, కాముడు, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:45:04+05:30 IST