అర్జీదారులు సంతృప్తి చెందేలా వినతులు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-09-26T00:14:00+05:30 IST
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల ను సకాలంలో, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్
- స్పందనలో 87 వినతులు
అరసవల్లి, సెప్టెంబరు 25: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల ను సకాలంలో, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాపరిష త్ సమావేశ మందిరంలో నిర్వహిం చిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 187 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్ర భుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని, కోరారు. స్పందనకు వచ్చే అర్జీదారులు లాభపడా లని, ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రీ ఓపెన్ అయిన అర్జీలు, పెం డింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవకులుగా భావించి, జవాబుదారీతనంతో సేవలం దించాలని కోరారు. సంతృప్తి చెందని దరఖాస్తులు 45 వరకు ఉన్నాయని, ఆడిట్ బృందం వీటిని పునఃపరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. సరైన సమాధానాలు ఇవ్వని అధికారులకు షోకాజ్ నోటీ సులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట రామన్, డీపీవో వి.రవికుమార్, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, సరఫరాల అధికారి డి.వెంకటరమణ, డ్వామా పీడీ చిట్టిరాజు, ఎస్‌ఎస్‌ఏ జయప్రకాష్, ఉద్యానవన అధికారి ఆర్‌వీ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘పోలీసు స్పందన’కి 56 అర్జీలు
శ్రీకాకుళం క్రైం, సెప్టెం బరు 25: స్పందనలో వచ్చే అర్జీలకు చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులకు ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశించారు. జిల్లా పొలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకి 56 అర్జీలు వచ్చాయి. వీటిలో కుటుంబ తగాదాలపై ఎనిమిది, పౌర సంబంధాలపై 15, చీటింగ్‌పై ఏడు, ఆస్తి తగాదాలపై తొమ్మిది, పాతకేసులకి సంబంధించి నాలుగు, ఇతర తగాదాలపై 13 ఫిర్యాదులు నమోదయ్యాయి. అనంతరం సంబంధిత స్టేషన్ ఇన్‌చార్జీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, అర్జీలపై దర్యాప్తు చేపట్టి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఏఎస్పీలు టీపీ విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామి ఉన్నారు.