జమ్ములో గ్రామదేవత పండగలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-04-30T23:47:15+05:30 IST

జమ్ము గ్రామంలో గ్రామదేవత అసిరి తల్లి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గ్రా మంలో గుజ్జడి బండిని ఊరేగించి దేవరను తీసుకువచ్చారు. మరి డమ్మ, నూకాలమ్మలకు మొక్కులను చెల్లించా రు. ఎటువంటి సంఘటనలు జరగ కుండా ఎస్‌ఐ సింహాచలం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు.

జమ్ములో గ్రామదేవత పండగలు ప్రారంభం
దేవరలను తీసుకువస్తున్న గ్రామస్థులు

నరసన్నపేట: జమ్ము గ్రామంలో గ్రామదేవత అసిరి తల్లి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గ్రా మంలో గుజ్జడి బండిని ఊరేగించి దేవరను తీసుకువచ్చారు. మరి డమ్మ, నూకాలమ్మలకు మొక్కులను చెల్లించా రు. ఎటువంటి సంఘటనలు జరగ కుండా ఎస్‌ఐ సింహాచలం ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వాన గోవిందరాజులు, రెడ్డి సంధ్య, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కిన్నెరవాడలో సిరిమాను సంబరాలు..

సారవకోట (జలుమూరు): కిన్నెరవాడ గ్రామంలో చెవిటమ్మతల్లి సిరిమాను ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గుజ్జుడు బండిని తయారుచేసి గ్రామోత్సవం చేసి మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాన్ని విద్యుద్దీపాలతో, పచ్చని తోరణాలతో అలంకరించారు. సోమవారం కొమనాపల్లి వెళ్లి సిరిమానుకు పూజలు చేసి మంగళ వాయిద్యాలతో బుడితి, అవలింగి గ్రామాల మీదుగా గ్రామానికి చేరుస్తారు. మంగళవారం సిరిమాను సంబరం నిర్వహిస్తారు. మంగళ వాయిద్యాల నడుమ బిందెలు, కాళీమాత వేషధారణలతో ఊరేగింపు నిర్వహిస్తారు.

Updated Date - 2023-04-30T23:47:15+05:30 IST