గ్రామసభలు నిర్వహించి ఓట్లు తొలగించాలి
ABN , First Publish Date - 2023-09-06T00:47:22+05:30 IST
నరసన్నపేట నియోజవర్గంలో ఇంటింటా ఓటర్ల సర్వేలో వలస ఓట్లు, ఇతర ఓట్లను తొలగించేందుకు బీఎల్‌వోలు, బీ ఎల్‌ఏ ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి కోరారు. మంగళ వారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో జయదేవి అధ్యక్షతన రాజకీ య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట: నరసన్నపేట నియోజవర్గంలో ఇంటింటా ఓటర్ల సర్వేలో వలస ఓట్లు, ఇతర ఓట్లను తొలగించేందుకు బీఎల్‌వోలు, బీ ఎల్‌ఏ ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి కోరారు. మంగళ వారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో జయదేవి అధ్యక్షతన రాజకీ య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలో 4 శాతం ఓట్లు కొత్తగా నమోదు చేశారని, వలసదారులు, డబుల్ ఎం ట్రీలు, చనిపోయిన వారి పేర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఓట ర్ల నమోదుకు సహకరించాలని ఆర్వో కోరారు. సరిగా లేని పోలింగ్ బూత్‌ల వివ రాలను బీఎల్‌వోలకు అందించాలన్నారు. ఎలక్షన్ డీటీ శరత్‌కుమార్, టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రజల భరోసాకే ‘భవిష్యత్ గ్యారెంటీ’
జలుమూరు: రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకే టీడీపీ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. చల్లవానిపేటలో మంగళ వారం టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో టీడీపీ విజయానికి సం బంధించి మేనిఫెస్టోలోని అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పంచిరెడ్డి రామ చంద్రరావు, టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు బగ్గు గోవిందరావు, త్రినాథరావు, వీరన్నాయుడు, బాలకృష్ణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.