Share News

కృష్ణప్పపేటలో సర్పంచ్‌ల గ్రామసభ

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:04 AM

గ్రామ వికాస పత్రాన్ని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ సిద్ధం చేసింది. ఈ మేరకు కృష్ణప్పపేటలో గురువారం నిర్వహించిన గ్రామసభలో చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఇందుకు సంబంధిం చిన వివరాలు వెల్లడించారు.

కృష్ణప్పపేటలో సర్పంచ్‌ల గ్రామసభ

శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): గ్రామ వికాస పత్రాన్ని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ సిద్ధం చేసింది. ఈ మేరకు కృష్ణప్పపేటలో గురువారం నిర్వహించిన గ్రామసభలో చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఇందుకు సంబంధిం చిన వివరాలు వెల్లడించారు. జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ అధ్యక్షతన గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. నిధులు, అధికారం లేక పంచాయ తీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. గ్రామ ప్రజలతో చర్చించి.. వారి సమస్యలు, వాటికి పరిష్కారంపై గ్రామస్థుల నుంచి తెలుసుకుని ‘గ్రామవికాస పత్రాన్ని’ రూపొందించారు. రాష్ట్ర స్థాయిలో త్వరలో నిర్వహించనున్న సర్పంచ్‌ల సదస్సులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని, ఆయన దృష్టికి ఈ విషయాలు తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటామని స్పష్టంచేశారు.

Updated Date - Dec 22 , 2023 | 12:04 AM