ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపం

ABN , First Publish Date - 2023-01-21T23:36:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలం కావ డంతో రైతులు ఇబ్బందులకు తప్పడంలేదని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. శనివారం కంచిలిలోని వేబ్రిడ్జి వద్ద నిలిచిపోయిన ధాన్యం వాహనాలను పరిశీలించారు.

ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపం
ధాన్యం వాహనాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

కంచిలి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలం కావ డంతో రైతులు ఇబ్బందులకు తప్పడంలేదని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. శనివారం కంచిలిలోని వేబ్రిడ్జి వద్ద నిలిచిపోయిన ధాన్యం వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటను సమీపంలోని మిల్లులకు తరలించాలని కోరా రు. కంచిలి మండల వాసులకు కోటబొమ్మాళి, నర సన్నపేట, పలాస ప్రాం తాలకు ధాన్యాన్ని తరలిం చాలని కోరడం సరికాదని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాల ని కోరారు. టీడీపీ నాయకులు కామేష్‌, రామారావు, కురయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T23:36:19+05:30 IST