Share News

వైభవంగా హిందూ ధార్మిక మహాసమ్మేళనం

ABN , First Publish Date - 2023-12-11T00:31:21+05:30 IST

పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమంలో ఆదివారం హిందూ ధార్మిక మహాసమ్మేళనం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా హిందూ ధార్మిక మహాసమ్మేళనం
మాట్లాడుతున్న స్వామీ శ్రీనివాసానంద

పొందూరు, డిసెంబరు 10: పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమంలో ఆదివారం హిందూ ధార్మిక మహాసమ్మేళనం వైభవంగా నిర్వహించారు. ఆనందాశ్రమ పీఠాధిపతి, సాధుపరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. అధిక సంఖ్యలో హిందువులు, భక్తులు పాల్గొన్నారు. ‘హిందువునని గర్విద్దాం.. హిందువుగా జీవిద్దాం’ అని నినాదాలు చేశారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారాలు, మతమార్పిడులు పెరిగిపోయాయని, హిందూ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను మనమే పరిరక్షించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ హిందూప్రచారకులు(తిరుపతి) రాధా మనోహర్‌దాస్‌ స్వామీజీ, యోగేష్‌ ప్రభూజీ స్వామీజీ (హైదరాబాద్‌), పద్మజానంద మాతాజీ, ప్రకాశానంద సరస్వతి(గుంటూరు), ఒడిశా నుంచి 24 మంది స్వామీజీలు 20 వేలమంది భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:31:23+05:30 IST