నాక్‌ బృందం సందర్శనకు సిద్ధం

ABN , First Publish Date - 2023-05-31T23:58:07+05:30 IST

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను నాక్‌ బృందం సందర్శించనుందని.. ఇందుకోసం సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి అన్నారు.

నాక్‌ బృందం సందర్శనకు సిద్ధం
అధికారులకు సూచనలిస్తున్న ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి

- ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి

ఎచ్చెర్ల, మే 31: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను నాక్‌ బృందం సందర్శించనుందని.. ఇందుకోసం సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి అన్నారు. స్థానిక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను బుధవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, హాస్టల్‌ భవనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాక్‌ మెరుగైన గ్రేడ్‌ సాధించేలా క్యాంపస్‌లో ఉన్న వసతులు, సాధించిన విజయాలు బృందానికి సక్రమంగా చూపించాలి. ఇందుకు తగినట్టుగా బోధనా సిబ్బంది అవసరమైన ప్రాక్టీస్‌ చేయాలి. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు అసౌక్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడి క్యాంపస్‌లోని వసతిగృహంలో ఓ బ్లాక్‌ను సిద్ధంచేయాలి’ అని సూచించారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌డీ సుధాకర్‌బాబు, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:58:07+05:30 IST