స్నేహభావం పెంపొందాలి

ABN , First Publish Date - 2023-03-30T23:47:31+05:30 IST

క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందాలని సీఐ ఎం.వినోద్‌బాబు అన్నారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపం వద్ద ఉన్న గ్రౌండ్‌లో మండలస్థాయి ఎస్పీ పోలీస్‌ కప్‌ పేరిట క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలను గురువారం ప్రారం భించారు.

స్నేహభావం పెంపొందాలి
క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న సీఐ వినోద్‌బాబు తదితరులు

పాతపట్నం: క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందాలని సీఐ ఎం.వినోద్‌బాబు అన్నారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపం వద్ద ఉన్న గ్రౌండ్‌లో మండలస్థాయి ఎస్పీ పోలీస్‌ కప్‌ పేరిట క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలను గురువారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు ఎస్పీ ఆదేశాలతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం హెచ్‌బీ కాలనీ సమీపంలో వాలీబాల్‌ పోటీ నిర్వహిస్తున్నట్లు పీడీ యెన్ని శేఖర్‌బాబు తెలిపారు. విజేతలకు ఎస్పీ బహుమతులు అందిస్తారని ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు.

క్రీడల్లో సత్తాచాటాలి

వజ్రపుకొత్తూరు: క్రీడల్లో సత్తాచాటాలని కాశీబుగ్గ రూరల్‌ సీఐ శంకరరావు అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువా రం పూండిలో క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహభావం పెంపొం దించేం దుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. విజేతలకు బహుమ తులు, ధ్రువపత్రాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:47:31+05:30 IST