జడ్పీ మాజీ చైర్మన్ సూర్యనారాయణ మృతి
ABN , Publish Date - Dec 27 , 2023 | 12:16 AM
శ్రీకాకుళం జడ్పీ మాజీ చైర్మన్ ఎచ్చెర్ల సూర్యనారాయణ మంగళవారం ఉదయం మరణించారు.
అరసవల్లి: శ్రీకాకుళం జడ్పీ మాజీ చైర్మన్ ఎచ్చెర్ల సూర్యనారాయణ మంగళవారం ఉదయం మరణించారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆయన ఈ ఏడాది జూన్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం మళ్లీ ఆసుపత్రిలో చేర్పించా రు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈయన 1983 నుంచి టీడీపీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నారు. 1995-01 వరకు కిల్లిపాలెం సర్పంచ్‌గా, శ్రీకాకుళం జడ్పీటీసీగా గెలిచి 2001-06 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఈయనకు భార్య లక్ష్మి (మాజీ సర్పంచ్, కిల్లిపాలెం), ఇద్దరు కుమారులు వెంకట సత్యనారాయణ (అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), శ్రీధర్ (వ్యాపారవేత్త) ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ అమెరికా నుంచి వస్తున్నందున బుధవారం అత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.