విదేశీ అతిథులు వచ్చాయ్‌

ABN , First Publish Date - 2023-06-26T22:39:16+05:30 IST

జిల్లాకు విదేశీ అతిథులొచ్చాయి. తేలుకుంచి గ్రామానికి సైబీరియన్‌ పక్షుల తాకిడి ప్రారంభమైంది.

విదేశీ అతిథులు వచ్చాయ్‌
తేలుకుంచిలో చెట్లపై విదేశీ విహంగాలు

- తేలుకుంచిలో విదేశీ విహంగాల సందడి

ఇచ్ఛాపురం రూరల్‌, జూన్‌ 26 : జిల్లాకు విదేశీ అతిథులొచ్చాయి. తేలుకుంచి గ్రామానికి సైబీరియన్‌ పక్షుల తాకిడి ప్రారంభమైంది. ఖండాలు, సముద్రాలు, మంచుకొండలు, కారడవులు దాటుకొని ఇక్కడకు చేరుకుంటాయి. ఏటా నాలుగు నెలల పాటు విడిది చేస్తాయి. గూళ్లు అల్లుకొని.. గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగిన తరువాత పిల్లలను స్వదేశానికి తమతో పాటు తీసుకువెళ్తాయి. ప్రస్తుతం సైబీరియన్‌ పక్షులు చేరుకోవడంతో గ్రామంలో కిలకిలరావాలతో సందడి నెలకొంది. వీటిని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు వస్తున్నారు. వీటి రాకతో వర్షాలు కురిసి.. పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామ ప్రజలు నమ్ముతారు.

Updated Date - 2023-06-26T22:39:16+05:30 IST