ముంపు సమస్య పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-06-26T23:35:28+05:30 IST

శ్రీకాకుళం మండలం పెద్ద గనగళ్ల వానిపేట పంచాయతీలో వర్షం నీరు ఎక్కువైతే పెద్దగనగళ్లవానిపేట, చిన్నగనగళ్లవానిపేట, పుక్కళ్ల పేట, ఖాజీపేట, నరసయ్యపేట, గాంధీనగర్‌ తదితర గ్రామాలు మంపునకు గురవుతున్నాయని, అధికారు లు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించా లని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి కోరారు.

ముంపు సమస్య పరిష్కరించాలి
జేసీకి సమస్య వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

- మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

అరసవల్లి: శ్రీకాకుళం మండలం పెద్ద గనగళ్ల వానిపేట పంచాయతీలో వర్షం నీరు ఎక్కువైతే పెద్దగనగళ్లవానిపేట, చిన్నగనగళ్లవానిపేట, పుక్కళ్ల పేట, ఖాజీపేట, నరసయ్యపేట, గాంధీనగర్‌ తదితర గ్రామాలు మంపునకు గురవుతున్నాయని, అధికారు లు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించా లని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన లో ఈ విషయమై జేసీకి వినతిపత్రాన్ని సమర్పిం చారు. వర్షం పడితే ఉప్పుటేరు సముద్రం నీటితో కలిసి మొత్తం గ్రామాలను ముంచివే స్తున్నాయని వివరించారు. చెరు వు గట్ల కారణంగానే ఈ ఇబ్బం ది తలెత్తుతోందని అధికారులకు విన్నవించారు. ఇప్పటికే చాలా సార్లు స్పందనలో చెప్పడం జరిగిందన్నారు. జేసీ సానుకూ లంగా స్పందించారని, స్వయంగా వచ్చి పరిశీలి స్తానని హామీ ఇచ్చినట్టు ఆమె విలేకరులకు తెలి పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బర్రి రామారావు, ఎంపీటీసీ అమ్మోజీరావు, జిల్లా మత్స్యకార సంఘ మాజీ అధ్యక్షుడు మైలపిల్లి నర్సింగరావు, పుక్కల అప్పలస్వామి, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, తెలుగు యువత అధ్యక్షుడు రోణంకి క ల్యాణ్‌, బీసీ సెల్‌ మీడియా కన్వీనర్‌ బుక్కా యు గంధర్‌, ముద్దాడ అసిరినాయుడు, బర్రి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:35:55+05:30 IST