విద్యుత్‌ కోతలపై ధ్వజం

ABN , First Publish Date - 2023-05-25T23:55:00+05:30 IST

మండలంలో విద్యుత్‌కోతలపై ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. మండలంలో రెండు సబ్‌స్టేషన్లు ఉన్నా, రాత్రీపగలు అధికారులు విద్యుత్‌ కోత విధిస్తున్నారని పిడిమందస ఎంపీటీసీ సభ్యుడు వి. మాధవరావుతో పాటు పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

  విద్యుత్‌ కోతలపై ధ్వజం

మందస:మండలంలో విద్యుత్‌కోతలపై ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. మండలంలో రెండు సబ్‌స్టేషన్లు ఉన్నా, రాత్రీపగలు అధికారులు విద్యుత్‌ కోత విధిస్తున్నారని పిడిమందస ఎంపీటీసీ సభ్యుడు వి. మాధవరావుతో పాటు పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.గురువారం మందస మండల పరి షత్‌ కార్యాలయంలో ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. బుడంబో పీహెచ్‌సీ వైద్యసిబ్బంది అందుబాటులో ఉండడం లేదని సాబకోట సర్పంచ్‌ సవర సంధ్య ప్రశ్నించారు.లొహరిబంద పంచా యతీలో అభివృద్ధి పనులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిశూన్యమని ఎంపీటీసీ సభ్యురాలు కె.సుమ లత నిలదీశారు. సంకుజోడు చెరువు పనులు నెలరోజుల్లో చేపట్టకపోతే తన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పిడి మందస ఎంపీటీసీ సభ్యుడు వి.మాధవరావు తెలిపారు. పలువురు అధికారులు గైర్హాజరుకావడంతో సభ్యుల ప్రశ్నకు సమాధానాలు కరువయ్యాయి. సమావేశంలో ఎంపీడీవో వి.తిరుమలరావు, డీటీ కె.విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:55:00+05:30 IST