లోకేష్‌ పాదయాత్రతో వైసీపీకి అంతిమయాత్ర

ABN , First Publish Date - 2023-01-26T00:19:22+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‘యువగళం’ పాదయాత్రతో వైసీపీ ప్రభు త్వానికి అంతిమయాత్ర అని టీడీపీ నియోజవర్గ ఇన్‌ చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం తామరాపల్లి గ్రామ సమీపంలో తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో లోకేష్‌ పాద యాత్రకు సంఘీభావ కార్యక్రమం చేపట్టారు.

లోకేష్‌ పాదయాత్రతో వైసీపీకి అంతిమయాత్ర
సారవకోట (జలుమూరు): కిన్నెరవాడలో వీరబ్రహ్మేంద్ర స్వామికి పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు

మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‘యువగళం’ పాదయాత్రతో వైసీపీ ప్రభు త్వానికి అంతిమయాత్ర అని టీడీపీ నియోజవర్గ ఇన్‌ చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం తామరాపల్లి గ్రామ సమీపంలో తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో లోకేష్‌ పాద యాత్రకు సంఘీభావ కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో వచ్చిన స్పందన చూసిన వైసీపీ ప్రభుత్వం లోకేష్‌ పాద యాత్రకు షరతులతో కూడిన అనుమతులిచ్చిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే చంద్ర బాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. ఎన్ని కుట్రలు పన్నినా లోకేష్‌ పాదయాత్ర ను అడ్డుకోలేరన్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు మాట్లాడుతూ.. యవతకు ఉపాధి కల్పిస్తామని మోసగించిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత నాయకులు బలగ ప్రహర్ష, తమ్మినేని సుజాత, తంగి తారకేశ్వరరావు, రావాడ గణ పతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువగళం అక్షరమాల రూపంలో మానవహారంగా ఏర్పాటయ్యారు.

వీరబ్రహ్మం ఆలయంలో ‘బగ్గు’ పూజలు

సారవకోట (జలుమూరు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపడుతున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బుధవారం కిన్నెరవాడలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు ధర్మాన తేజకుమార్‌, సరవరపు తిరుపతిరావు, కత్తిరి వెంకటరమణ, జగన్నాఽథ దొర, సాధు చిన్నికృష్ణంనాయుడు, తాడేల భీమారావు, డి.జయరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:19:22+05:30 IST