మెడికల్‌ మాఫియాపై పోరాటం

ABN , First Publish Date - 2023-08-02T23:46:25+05:30 IST

మెడికల్‌ మాఫియాపై ప్రభుత్వం వెనుకంజవేస్తోందని, దీనిపై తాము పోరాటం చేస్తామని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. యుగంధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నరసన్నపేటలో ఆ సంఘం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం మెడికల్‌ మాఫియాకు హబ్‌గా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు లంచాలకు అలవాటు పడి మాఫియాను పెంచి పోసిస్తున్నారని ఆరోపిం చారు. నాసిరకం మందులను ఒకేరకమైన పేర్లతో అక్షరాలు మార్చి పది రూపాయలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఆసుపత్రి యాజమాన్యాలు మెడికల్‌ షాపులతో కుమ్మక్కయ్యాయని తెలిపారు. ఈ కార్య క్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు గుంట కర్ణవీరుడు, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ మాఫియాపై పోరాటం

నరసన్నపేట: మెడికల్‌ మాఫియాపై ప్రభుత్వం వెనుకంజవేస్తోందని, దీనిపై తాము పోరాటం చేస్తామని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. యుగంధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నరసన్నపేటలో ఆ సంఘం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం మెడికల్‌ మాఫియాకు హబ్‌గా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు లంచాలకు అలవాటు పడి మాఫియాను పెంచి పోసిస్తున్నారని ఆరోపిం చారు. నాసిరకం మందులను ఒకేరకమైన పేర్లతో అక్షరాలు మార్చి పది రూపాయలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఆసుపత్రి యాజమాన్యాలు మెడికల్‌ షాపులతో కుమ్మక్కయ్యాయని తెలిపారు. ఈ కార్య క్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు గుంట కర్ణవీరుడు, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:46:25+05:30 IST