సహకారంతో ఉత్సవాలు విజయవంతం
ABN , First Publish Date - 2023-06-07T23:38:05+05:30 IST
గ్రామస్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులందరి సహకారంతో నీలమణి అమ్మవారి పెద్ద పండగలు విజయవంతం అయ్యాయని ఉత్సవ ప్రధాన కమిటీ ప్రతినిధులు అన్నారు. బుధవారం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఉత్సవాలు విజయవంతం చేసిన వారిని అభినందించారు.
పాతపట్నం: గ్రామస్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులందరి సహకారంతో నీలమణి అమ్మవారి పెద్ద పండగలు విజయవంతం అయ్యాయని ఉత్సవ ప్రధాన కమిటీ ప్రతినిధులు అన్నారు. బుధవారం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఉత్సవాలు విజయవంతం చేసిన వారిని అభినందించారు. ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల భాగస్వామ్యం అయ్యారని, వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న నీలమణి దుర్గమ్మ పండగను అధికారిక ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఉత్సవ ప్రధాన కమిటీ అధ్యక్షుడు లింగాల రవి కుమార్, కన్వీనర్ మధుబాబు, పైల లక్ష్మయ్య, పైల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.