Share News

కోటపాలెంలో రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2023-11-22T00:10:11+05:30 IST

కోటపాలెం రెవెన్యూ పరిధిలోని మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కోటపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 59- 6లో 5.63 ఎకరాల డీపట్టా భూమిని గ్రామానికి చెందిన 11 మంది సాగుచేస్తున్నామని రైతులు తెలిపా రు. అయితే ఇదే భూమిలో 29 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈనేప థ్యంలో పోలీసులతో మంగళవారం తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌ సిబ్బందితో వెళ్లా రు. యంత్రాలతో భూమి చదును చేసే సమయంలో సాగు చేసిన రైతులు ఆందోళన చేశారు. దీంతో ఇది ప్రభుత్వభూమి అని, పేదలకు ఇళ్ల స్థలాలకు ఇచ్చినట్లు తహసీ ల్దార్‌ కిరణ్‌కుమార్‌ వారికి తెలియజేశారు. 5.63 ఎకరాలు స్వాధీనంచేసుకోకుండా తాను సాగుచేసిన భూమినే ఎందుకు తీసుకుంటున్నారని రైతు రాయిపురెడ్డి అప్పా రావు ప్రశ్నించాడు. 5.63 ఎకరాలు స్వాధీనం చేసుకొని 29 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, మిగతా భూమి పంచాయతీకి అప్పగించామని తహసీల్దార్‌ తెలిపారు.

  కోటపాలెంలో రైతుల ఆందోళన

రణస్థలం: కోటపాలెం రెవెన్యూ పరిధిలోని మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కోటపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 59- 6లో 5.63 ఎకరాల డీపట్టా భూమిని గ్రామానికి చెందిన 11 మంది సాగుచేస్తున్నామని రైతులు తెలిపా రు. అయితే ఇదే భూమిలో 29 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈనేప థ్యంలో పోలీసులతో మంగళవారం తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌ సిబ్బందితో వెళ్లా రు. యంత్రాలతో భూమి చదును చేసే సమయంలో సాగు చేసిన రైతులు ఆందోళన చేశారు. దీంతో ఇది ప్రభుత్వభూమి అని, పేదలకు ఇళ్ల స్థలాలకు ఇచ్చినట్లు తహసీ ల్దార్‌ కిరణ్‌కుమార్‌ వారికి తెలియజేశారు. 5.63 ఎకరాలు స్వాధీనంచేసుకోకుండా తాను సాగుచేసిన భూమినే ఎందుకు తీసుకుంటున్నారని రైతు రాయిపురెడ్డి అప్పా రావు ప్రశ్నించాడు. 5.63 ఎకరాలు స్వాధీనం చేసుకొని 29 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, మిగతా భూమి పంచాయతీకి అప్పగించామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2023-11-22T00:10:12+05:30 IST