ఉల్లాసంగా స్విమ్మింగ్ పోటీలు
ABN , First Publish Date - 2023-10-30T01:02:15+05:30 IST
నగరంలోని శాంతినగర్ కాలనీలోని స్విమ్మింగ్ పూల్‌లో అండర్-19 ఎస్‌జీఎప్ జిల్లాస్థాయి ఈత పోటీలు ఉల్లాసంగా సాగాయి. ఇందులో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాఽధిస్తారని ఎస్‌జీఎప్ కార్యదర్శి ఎన్.రామన్న తెలిపారు. అదేవిధంగా ఎచ్చెర్ల ఏఆర్ మైదానంలో బాల్ బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, అక్టోబరు 29: నగరంలోని శాంతినగర్ కాలనీలోని స్విమ్మింగ్ పూల్‌లో అండర్-19 ఎస్‌జీఎప్ జిల్లాస్థాయి ఈత పోటీలు ఉల్లాసంగా సాగాయి. ఇందులో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాఽధిస్తారని ఎస్‌జీఎప్ కార్యదర్శి ఎన్.రామన్న తెలిపారు. అదేవిధంగా ఎచ్చెర్ల ఏఆర్ మైదానంలో బాల్ బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాల్ బాడ్మింట్ సంఘం ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. కార్యక్రమంలో సంఘ ప్రతిని ధులు అజయ్‌కుమార్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 1న ఎస్‌జీ ఎఫ్ జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం కార్యదర్శి ఎన్. రామన్న తెలిపారు. ఈ ఎంపికలు శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్‌లో నిర్వహి స్తారన్నారు.
సాధనతోనే విజయాలు సాధ్యం: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం స్పోర్ట్స్: క్రమశిక్షణతో కూడిన సాధన చేయడం ద్వారా విజయాలు సాధ్య పడతాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆది వారం కొన్నా చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్, తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. తైక్వాండో పోటీలను సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో నిర్వహించగా, సుమారు 350 మంది క్రీడా కారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సురేఖ, సుడా పీవో పీజీ రామ్మోహన్ రావు, డీటీసీపీవో డి.కిషోర్‌కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు, చీఫ్‌కోచ్ కె.శ్రీధర్, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.సాంబ మూర్తి, తైక్వాండో శ్రీను, తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొని క్రీడాకారులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.