రోజుకో ఉపాధ్యాయుడొస్తున్నాడు..

ABN , First Publish Date - 2023-06-26T23:30:45+05:30 IST

మా గ్రామానికి ఎంపీపీ స్కూల్‌ మంజూరు చేశారని, అయితే ఉపాధ్యాయులను నియమించకపోవడం తో రోజుకో టీచర్‌ వస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయని చాకిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

రోజుకో ఉపాధ్యాయుడొస్తున్నాడు..

- సబ్‌కలెక్టర్‌ ఎదుట చాకిపల్లి గ్రామస్థుల ఆవేదన

పాతపట్నం: మా గ్రామానికి ఎంపీపీ స్కూల్‌ మంజూరు చేశారని, అయితే ఉపాధ్యాయులను నియమించకపోవడం తో రోజుకో టీచర్‌ వస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయని చాకిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి డివిజనల్‌ స్థాయి స్పందనను బైదలాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్థులు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. శోభ పంచాయతీ బెన్నడగూడకు రోడ్డు లేదని, అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. బూర్జిగూడ, రేంగూడలో తాగునీటి సమస్య ఉందని, ఊట నీటినే తాగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తూరు మండలం ఎంజే పురానికి చెందిన డోల సంతోష్‌కుమార్‌ బ్రైన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నాడని, తండ్రి లేకపోవడంతో తానే కూలిపని చేసి కుమారుడికి వైద్య సేవలు అందిస్తున్నానని, సీఎం రిరీఫ్‌ ఫండ్‌ ద్వారా సాయమం దించాలని బాధితుడి తల్లి వినతిపత్రం అందించింది. వివిధ శాఖలకు సంబంధించి వినతులను స్వీకరించారు. తహసీల్దార్‌ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:30:45+05:30 IST