ఈఎస్‌ఐ ఆసుపత్రులు ప్రారంభించాలి
ABN , First Publish Date - 2023-05-27T00:09:27+05:30 IST
మూసివేసిన ఎచ్చెర్ల, శ్రీకాకుళం ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఆసుపత్రుల ను వెంటనే ప్రారంభించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.

అరసవల్లి: మూసివేసిన ఎచ్చెర్ల, శ్రీకాకుళం ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఆసుపత్రుల ను వెంటనే ప్రారంభించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐ) కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎస్‌ఐ పథకాన్ని బలోపేతం చేయాలని, మూసివేసిన ఆసుపత్రులను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం బ్రాంచ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.నాయుడుబాబు, మేనేజర్ పి.రమేష్‌కు మార్‌కు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ, కార్యదర్శులు ఎల్.వరదరాజు, మాన్యం రమణ, అల్లు సత్యనారాయణ, ఎల్.వరద రాజు రమణ, పి.దుర్గాప్రసాద్, వై.గోపాలుడు తదితరులు పాల్గొన్నారు.