సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-03-18T23:50:13+05:30 IST

మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల పర్మినెంట్‌, సంక్షేమ పథకాల అమలు, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500 జీతం చెల్లించాలని, పర్మినెంట్‌ కార్మికుల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) పిలుపు మేరకు జిల్లా లోని కార్మికులు కలెక్టర్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న మునిసిపల్‌ కార్మికులు

అరసవల్లి: మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల పర్మినెంట్‌, సంక్షేమ పథకాల అమలు, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500 జీతం చెల్లించాలని, పర్మినెంట్‌ కార్మికుల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) పిలుపు మేరకు జిల్లా లోని కార్మికులు కలెక్టర్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువురాని, సొంత ఫోన్లు లేని కార్మికుల్ని ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ పేరుతో వేధింపులకు గురిచేయడం అమానుష మన్నారు. తాము అధికారంలోకి వస్తే కేవలం ఆరు నెలల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముందుగా శ్రీకాకుళం ఆర్‌ అండ్‌ బీ బంగ్లా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు అరుగుల్ల గణేష్‌, ఎన్‌.బలరాం, టి.సంతోష్‌, కళ్యాణ రాజు, ఏ.జనార్థనరావు, శేఖర్‌, మాధవి, జె.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:50:21+05:30 IST