జీపీఎస్‌పై ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2023-09-22T00:01:02+05:30 IST

జీపీఎన్‌ విధానాన్ని క్యాబినెట్‌ ఆమోదించడంపై ఉద్యోగులు గురువా రం నిరసన తెలిపారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు తూముల సూర్యారావు, పీఆర్‌టీయూ నాయకులు ప్రసాదరావు, రుషి, శివకృష్ణ, ఎన్‌జీవో కొత్త తాలూకా అధ్యక్షుడు అల్లు తిరుపతిరావు, మిన్నారావు, రాజగోపాల్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు వై.సత్యనారాయణ,సీపీఎస్‌ నాయకులు తిరు పతిరావు, ఇప్పిలి శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు.

  జీపీఎస్‌పై ఉద్యోగుల నిరసన
సోంపేట: నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు :

కొత్తూరు: జీపీఎన్‌ విధానాన్ని క్యాబినెట్‌ ఆమోదించడంపై ఉద్యోగులు గురువా రం నిరసన తెలిపారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు తూముల సూర్యారావు, పీఆర్‌టీయూ నాయకులు ప్రసాదరావు, రుషి, శివకృష్ణ, ఎన్‌జీవో కొత్త తాలూకా అధ్యక్షుడు అల్లు తిరుపతిరావు, మిన్నారావు, రాజగోపాల్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు వై.సత్యనారాయణ,సీపీఎస్‌ నాయకులు తిరు పతిరావు, ఇప్పిలి శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు. ఫసోంపేట: జీపీఎస్‌ విధానం రద్దుచేయాలని, పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలని ఏపీసీపీఎస్‌ఈఏ మండల అధ్యక్షుడు తలగాన చంద్రశేఖర్‌ డిమాండ్‌చేశారు. ఈసందర్భంగా గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌ టీయూ రాష్ట్ర నాయకులు శరత్‌, రమేష్‌ పాణిగ్రాహి, వేణుగోపాల్‌, మాధవరావు, దాలిబంధు, యూటీఎఫ్‌ నాయకులు బాబూరావు, ఏపీటీఎఫ్‌ నాయకులు గోవిందరావు, చాణక్య, రాజేష్‌, బీటీఏ నాయకులు మోహన్‌రావు, ఈశ్వరరావు, సత్యవతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు,ఫ పాతప ట్నం: ప్రభుత్వ ఉద్యోగులకు నష్టపరిచే జీపీఎస్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు దువ్వారిచలపతిరావు, సనపల నరసింహరావు డిమాండ్‌ చేశారు. గురువారం పెద్దలోగిడి జడ్పీపాఠశాల ప్రాంగణంలోసంఘనాయకులు సభ్యు లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు శర శ్చంద్ర పాడి, మండలా ధ్యక్ష ప్రధానకార్యదర్శులు సిరిపురం సోమేశ్వరరావు, హరి విశ్వాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:01:02+05:30 IST