విద్యుత్ చార్జీలు తగ్గించాలని..
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:05 AM
విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. గురువారం బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
- బీజేపీ శ్రేణుల నిరసన
- రణస్థలంలో హైవే దిగ్బంధం
రణస్థలం, డిసెంబరు 21: విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. గురువారం బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బంటుపల్లి నుంచి వందలాది మంది పార్టీ శ్రేణులు ర్యాలీగా రణస్థలం తరలివచ్చారు. తహసీల్దార్, విద్యుత్‌శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సాయంత్రం సుమారు 400 మంది కార్యకర్తలతో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎన్‌ఈఆర్‌తో సహా కీలక నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఈఆర్ మాట్లాడుతూ.. ‘విద్యుత్ సరఫరా నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ట్రూఆఫ్, ఇంధన సర్దుబాటు, ఇలా రకరకాలుగా విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ప్రభుత్వం స్థిరీకరించలేకపోతోంది. అప్రకటితో కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామ’ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లంక అప్పలనాయుడు, ఎస్.నాగేశ్వరరావు, పీవీ రత్నం, కాయిత రమణ, ఎం.శ్యామ్, చంటి, డి.ఆదినారాయణ, దన్నాన రాజేశఖర్, గొర్లె శ్రీధర్, ఆకుల రవికుమార్ పాల్గొన్నారు.