యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2023-11-21T23:51:46+05:30 IST
యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం చల్లవానిపేట ఉన్నత పాఠశాలలో సంఘ సమావేశంలో ఎన్నుకున్నారు.

జలుమూరు: యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం చల్లవానిపేట ఉన్నత పాఠశాలలో సంఘ సమావేశంలో ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా ఎన్.హర్షవర్థన్, గౌరవాధ్యక్షుడిగా జి.రాము, ఉపాధ్యక్షులుగా కె.రాజారావు, ఎల్.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఎన్.పురుషోత్తమరావు, కోశాధికారిగా మూల రమణ, కార్యదర్శులుగా ఎ.సంతోష్‌కుమార్, సీహెచ్ సింహాచలంతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.