చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2023-12-03T23:04:15+05:30 IST
మండలంలోని బడ్డుమర్రి గ్రామానికి చెందిన యడ్ల దాలయ్య(65) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... మద్యానికి బాని సైన దాలయ్య ఆరోగ్యం క్షీణిస్తుండడంతో భార్య బసంతి మందలించడంతో మనస్తాపానికి గురైన శనివారం వేకువజామున ఇంట్లో గడ్డిమందు తాగాడు. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించి టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సచేశారు. అనంతరం వైద్యుల సిఫారసు మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించ గా అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. దాలయ్య భార్య ఆదివారం ఇచ్చినఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేశారు.
పాతపట్నం : మండలంలోని బడ్డుమర్రి గ్రామానికి చెందిన యడ్ల దాలయ్య(65) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... మద్యానికి బాని సైన దాలయ్య ఆరోగ్యం క్షీణిస్తుండడంతో భార్య బసంతి మందలించడంతో మనస్తాపానికి గురైన శనివారం వేకువజామున ఇంట్లో గడ్డిమందు తాగాడు. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించి టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సచేశారు. అనంతరం వైద్యుల సిఫారసు మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించ గా అక్కడ చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. దాలయ్య భార్య ఆదివారం ఇచ్చినఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేశారు.