ముందస్తు గృహ నిర్బంధాలు
ABN , First Publish Date - 2023-09-25T23:55:30+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరె స్టును ఖండిస్తూ సోమవారం శ్రీకా కుళం గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చేం దుకు దళిత నాయకులు హాజర వుతున్న దృష్ట్యా పోలీసులు ముం దస్తు అరెస్టులు చేశారు.

పలాస రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరె స్టును ఖండిస్తూ సోమవారం శ్రీకా కుళం గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చేం దుకు దళిత నాయకులు హాజర వుతున్న దృష్ట్యా పోలీసులు ముం దస్తు అరెస్టులు చేశారు. బ్రాహ్మణ తర్లాకు చెందిన టీడీపీ దళిత నాయకుడు వడ్డి యాదగిరిని ఆయన ఇంటిలోనే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు..
పలాసరూరల్: విజయవాడలో జరిగే దీక్షకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హాజరవకుండా ఉండేలా కాశీబుగ్గ పోలీసులు ముం దస్తుగా వారిని సోమవారం హౌస్ అరెస్టు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు పి.బాలరాజు, యు.అప్పలరాజు, పి.శేఖర్‌లను స్టేషన్ కు తరలించి నిర్బంధించారు. పలాస మండలం మామిడి పల్లిలో అంగన్‌వాడీ కార్యకర్త తులసమ్మను హౌస్ అరెస్టు చేశా రు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాటం సాగుతుందని వారు స్పష్టం చేశారు.
ఏఐవైఎఫ్ నాయకులు..
నరసన్నపేట: పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిం చిన ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షలకు రెండు నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ మంగళవారం విజయవాడలో నిర్వహించనున్న ధర్నా కు ఏఐవైఎఫ్ నాయకులు వెళ్లకుండా పోలీసులు ముంద స్తుగా నోటీసులిచ్చి హౌస్ అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఏఐ వైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి ఎ.రాములు తదితరులున్నారు.