Share News

దుర్గ్‌ రైలును పలాస వరకు పొడిగించాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:51 PM

దుర్గ్‌ రైలు ప్రస్తుతం విజయనగరం వరకే వస్తోందని, దానిని పలాస వరకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర-ఉత్కళ్‌ సంఘర్ష్‌ సమితి ప్రతినిధి కుమార్‌నాయక్‌, కళాంజలి సంస్థ వ్యవస్థాపకుడు కొవిరి రాజు బీజేపీ ఎంపీ విజయబద్వేల్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం భిలాయ్‌ పట్టణం లో ఎంపీని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందించారు.

దుర్గ్‌  రైలును పలాస వరకు పొడిగించాలి

పలాసరూరల్‌: దుర్గ్‌ రైలు ప్రస్తుతం విజయనగరం వరకే వస్తోందని, దానిని పలాస వరకు పొడిగించేలా చర్యలు తీసుకో వాలని ఆంధ్ర-ఉత్కళ్‌ సంఘర్ష్‌ సమితి ప్రతినిధి కుమార్‌నాయక్‌, కళాంజలి సంస్థ వ్యవస్థాపకుడు కొవిరి రాజు బీజేపీ ఎంపీ విజయబద్వేల్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం భిలాయ్‌ పట్టణం లో ఎంపీని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ రైలు పొడిగింపు వల్ల ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు దక్షిణ ఒడిశా వాసులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు బద్రి జోగా రావు, పిట్ట దుర్యోధన, వంక రాజారావు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:51 PM