Share News

మండలంలో కరువు విలయతాండవం

ABN , First Publish Date - 2023-10-30T01:04:18+05:30 IST

పలాస మండలంలో కరువు విలయ తాండవం చేస్తుంటే అధికారు లు, అధికార పార్టీ నాయ కులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వామపక్ష నాయకులు అన్నారు. బొడ్డ పాడు పరిధి, మందస మండలం రఘునాథ పురంలో ఎండిన పంట పొలాలను వామపక్ష నాయకులు ఆది వారం పరిశీలించారు.

మండలంలో కరువు విలయతాండవం
బొడ్డపాడులో ఎండిన పంటలను పరిశీలిస్తున్న నేతలు

పలాసరూరల్‌: పలాస మండలంలో కరువు విలయ తాండవం చేస్తుంటే అధికారు లు, అధికార పార్టీ నాయ కులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వామపక్ష నాయకులు అన్నారు. బొడ్డ పాడు పరిధి, మందస మండలం రఘునాథ పురంలో ఎండిన పంట పొలాలను వామపక్ష నాయకులు ఆది వారం పరిశీలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు చాపర వేణుగోపాల్‌, మద్దిల రామారావు మాట్లాడుతూ.. ఆరు గాలం కష్టపడిన రైతుకు పంట పాడై కన్నీళ్లే మిగిలాయని, రైతుగోడు పట్టదా అని ప్రశ్నిం చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెబుతున్న వైసీపీ నాయకులు గత నాలుగేళ్లుగా పంటకు నీరివ్వలేని పరిస్థితిలో ఉందని, కనీసం కాలువల్లో పూడికలు తీయలేదన్నారు. ఇప్పటి కైనా అధికారులు, నేతలు స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు ఎం.వినోద్‌, వంకల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T01:04:18+05:30 IST