మీరిచ్చే పాంప్లెట్స్‌ మాకొద్దు

ABN , First Publish Date - 2023-05-26T23:57:02+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే పం పిణీ చేసిన పాంప్లెట్స్‌ (కర పత్రాలు) తమకొద్దంటూ గిరిజనులు కాల్చివేశారు. ఈ ఘటన మెళియాపుట్టి మండలం సవరజీడి పాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది.

మీరిచ్చే పాంప్లెట్స్‌ మాకొద్దు
పాంప్లెట్స్‌ను కాల్చివేస్తున్న దృశ్యం

- గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతికి చేదు అనుభం

- పంపిణీ చేసిన పత్రాలను కాల్చివేసిన గిరిజనులు

మెళియాపుట్టి, మే 26: వైసీపీ ఎమ్మెల్యే పం పిణీ చేసిన పాంప్లెట్స్‌ (కర పత్రాలు) తమకొద్దంటూ గిరిజనులు కాల్చివేశారు. ఈ ఘటన మెళియాపుట్టి మండలం సవరజీడి పాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా జీడిపాలెం, సవర జీడిపాలెం గ్రామాల్లో పర్య టించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ఫొటోతో ఉన్న పాంప్లెట్స్‌ పంపిణీ చేశారు. అయితే ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లిపోగానే సవరజీడిపాలెంలో కొందరు గిరిజనులు పాంప్లెట్స్‌ కాల్చివేశారు. వైసీపీ ప్రభుత్వం బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను ఆమో దించడంపై గిరిజన సంఘాలు కొద్దిరోజులుగా నిరసన కార్యక్రమా లు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం పాంప్లెట్స్‌ ను కాల్చివేసినట్లు చెబుతున్నారు.

Updated Date - 2023-05-26T23:57:02+05:30 IST