సరైన పత్రాలు లేకుండా ఫోన్లు కొనొద్దు

ABN , First Publish Date - 2023-03-18T23:55:06+05:30 IST

సరైన పత్రాలు లేకుండా ఫోన్లను కొనవద్దని ఎస్పీ జీఆర్‌ రాధిక ప్రజలకు సూచించారు. సుమారు రూ.20లక్షల విలువగల 150 మొబైల్‌ ఫోన్లను జిల్లా పోలీస్‌ శాఖ లాస్ట్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్ట మ్‌ ద్వారా గుర్తించి రికవరీ చేసింది. వీటిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాధిక బాధితులకు అందజేశారు. ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా జిల్లా ఐటీ కోర్‌టీమ్‌ రూపొందించిన వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గతంలో రూ.12.5లక్షల విలువగల 130 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు, సైబర్‌ సెల్‌ సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ టీపీ విఠలేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద రావు, ఏఎస్‌ఐ బి.రమేష్‌, సైబర్‌ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సరైన పత్రాలు లేకుండా ఫోన్లు కొనొద్దు
స్వాధీనం చేసుకున్న ఫోన్లను చూపిస్తున్న ఎస్పీ

అరసవల్లి: సరైన పత్రాలు లేకుండా ఫోన్లను కొనవద్దని ఎస్పీ జీఆర్‌ రాధిక ప్రజలకు సూచించారు. సుమారు రూ.20లక్షల విలువగల 150 మొబైల్‌ ఫోన్లను జిల్లా పోలీస్‌ శాఖ లాస్ట్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్ట మ్‌ ద్వారా గుర్తించి రికవరీ చేసింది. వీటిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాధిక బాధితులకు అందజేశారు. ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా జిల్లా ఐటీ కోర్‌టీమ్‌ రూపొందించిన వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గతంలో రూ.12.5లక్షల విలువగల 130 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు, సైబర్‌ సెల్‌ సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ టీపీ విఠలేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద రావు, ఏఎస్‌ఐ బి.రమేష్‌, సైబర్‌ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:55:12+05:30 IST