మాదకద్రవ్యాలకు బానిస కావొద్దు

ABN , First Publish Date - 2023-06-26T22:48:17+05:30 IST

‘మాదకద్రవ్యాలకు బానిస కావొద్దు. వాటి వినియోగానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ఉద్యమించాల’ని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాలకు బానిస కావొద్దు
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లాఠ్కర్‌

అరసవల్లి, జూన్‌ 26: ‘మాదకద్రవ్యాలకు బానిస కావొద్దు. వాటి వినియోగానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ఉద్యమించాల’ని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు అర్థాయుష్కులవుతున్నారని, వారిని కాపాడుకోవాలన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, అమ్మకం, వినియోగం విషయమై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసుశాఖ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మాదకద్రవాల్య బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:48:17+05:30 IST