మొక్కజొన్న రైతుల కుదేలు

ABN , First Publish Date - 2023-03-20T00:04:44+05:30 IST

అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. జలుమూ రు మండలంలో నగిరికటకం, అచ్యుతాపురం, మెట్టపేట, శ్రీముఖలింగం తదితర గ్రామాల్లో మొక్కజొన్న విస్తారంగా పండించారు.

మొక్కజొన్న రైతుల కుదేలు
జలుమూరు: అచ్యుతాపురం వద్ద మొక్కజొన్న గింజలపై టార్పాలిన్‌ కప్పిన రైతులు

జలుమూరు: అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. జలుమూ రు మండలంలో నగిరికటకం, అచ్యుతాపురం, మెట్టపేట, శ్రీముఖలింగం తదితర గ్రామాల్లో మొక్కజొన్న విస్తారంగా పండించారు. పంట చేతికి అందివచ్చే సమయంలో వర్షాలు కురవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న పొట్టల నుంచి పిక్కలు వేరు చేసి ఆరబెట్టే తరుణంలో వర్షాలు కురవడంతో.. టార్పాన్లు కప్పి సంరక్షిస్తున్నారు. అలాగే ఇటుకలు తయారీ చేసే వారికి కూడా ఈ వర్షాల కారణంగా నష్టం వాటిల్లింది.

జి.సిగడాం: జి.సిగ డాం, పెంట, పెనసాం, నడిమివలస, బాతువ తదితర గ్రామాల్లో రైతులు మొక్కజొ న్న పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. వర్షానికి పంట తడిసిపోకుండా పరదాలతో కప్పుతున్నారు.

తడిసిపోయిన రాగులు

గార/పోలాకి: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో చేతికి అందివచ్చిన చోడి (రాగులు) పంట తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమం టున్నారు. ఇటీవల కొందరు రైతులు పంటను కోతకోసి పొలాల్లో కుప్పలుగా పెట్టారు. మరికొందరు పంటను నూర్పిడి చేస్తుండగా అకాల వర్షాలతో తడిసిపోయింది. పొలాల్లోనే పరదాలపై ఆరబెడుతున్నారు. అయితే, మొక్కజొన్న, మిరపకు ఈ వర్షం కొంత మేలు చేసిందని రైతులు చెబు తున్నారు. గాలులు వేస్తే మొక్కజొన్న నేలవాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-20T00:04:44+05:30 IST