15 నుంచి ఇంటి వద్దకే వైద్యుడు
ABN , First Publish Date - 2023-05-02T23:59:39+05:30 IST
‘ఇంటి వద్దకే వైద్యుడు’ విధానం ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తున్నట్టు డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు.
- డీఎంహెచ్‌వో మీనాక్షి
అరసవల్లి: ‘ఇంటి వద్దకే వైద్యుడు’ విధానం ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తున్నట్టు డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రొగ్రామ్ అధికారులు, వైద్యాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా తురకపేట, లింగాలవలస, మెట్టూరు, కళ్లేపల్లి, పురుషోత్తపురంలో పీహెచ్‌సీ కేంద్రాలు మంజూరయ్యాన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో వైద్యుడు ఇంటి వద్ద మంచంపై ఉన్న రోగులను, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొంది ఇంటి వద్ద ఉన్న రోగులను పరీక్షించి తగిన సలహాలు, సూచనలు అందించాలన్నారు. 104 వాహనం ద్వారా గ్రామానికి వెళ్లి ఓపీ చూడాలన్నారు. 14 రకాల వైద్య పరీక్షలు, కొవిడ్ టెస్టులు, టెలీ మెడిసిన్, 67 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో భాగంగా వైద్యులు స్కూల్స్ సందర్శించడం, టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. పుట్టిన దగ్గర నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు శత శాతం వ్యాధి నిరోధక టీకాలను వేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేసి, అవసరమైన వారికి వెంటనే వైద్యసేవలు అందించాలని సూచించారు. 12 వారాలలోపు గర్భిణులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేసి ఐడీలు ఇవ్వాలన్నారు. నెలవారీ రిపోర్టులను మెడికల్ ఆఫీసర్ తనిఖీ చేసి తప్పులు లేకుండా పంపించాలని కోరారు. ప్రతీ ఏఎన్‌ఎం యాప్‌లో వైఎస్‌ఆర్ క్లినిక్స్ స్టేటస్ అప్‌లోడ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో లక్ష్మీతులసి, వైద్యులు పి.సుజాత, కృష్ణమోహన్, పైడి వెంకటరమణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సూర్యకళ, మోహిని తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిధిలోని పలాస, ఆమదాలవలస, బుడితి, ఇచ్ఛాపురం, బారువ, హరిపురం, కవిటి, కోటబొమ్మాళి, కొత్తూరు ఆసుపత్రుల్లో రోగులకు, డ్యూటీ డాక్టర్లకు డైట్ సరఫరా చేసేందుకు రెండేళ్ల కాల పరిమితితో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సీల్డ్ కవర్‌లో టెండర్లను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి కార్యాలయంలో మే 10వ తేదీలోగా సమర్పించాలని తెలియజేశారు.