Share News

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-12-04T00:17:48+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ బీఎల్‌వోలకు సూచించారు. ఆదివారం మఖరాంపురం ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు: కలెక్టర్‌
ఓటర్ల లిస్ట్‌ పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

కంచిలి: విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ బీఎల్‌వోలకు సూచించారు. ఆదివారం మఖరాంపురం ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఓటర్ల జాబితాలో మహిళలు సంఖ్య ఎక్కువగా ఉండడంపై ఆయన ప్రశ్నించారు. చెక్‌ లిస్టును సబ్‌మిట్‌ చేసి ఈ నెల 7వ తేదీలోగా ప్రాసెస్‌ పూర్తిచేయాలన్నారు. సకాలంలో పూర్తిచేయని బీఎల్‌వోలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో వచ్చిన అర్జీలను పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్దానం తాగునీటి సరఫరా పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పలాస ఆర్డీవో భరత్‌ నాయక్‌, ఉద్దానం ప్రాజెక్ట్‌ డీఈలు ఆశాలత, రజాక్‌, జాన్‌బెన్‌హార్‌, ఎస్‌సీటీఎస్‌ ప్రసాద్‌, జడ్పీచైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, తహసీల్దార్‌ హైమావతి, కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సోంపేట సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-04T00:17:50+05:30 IST