సంకల్పానికి వైకల్యం అడ్డురాదు
ABN , First Publish Date - 2023-12-04T00:16:39+05:30 IST
దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, సంకాల్పనికి వైకల్యం అడ్డుకోలేదని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.
గుజరాతీపేట: దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, సంకాల్పనికి వైకల్యం అడ్డుకోలేదని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను స్థా నిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జేసీ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రభుత్వ నియామ యాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ అమలవుతుందని, బ్యాక్ లాగ్ పోస్టులో 239 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు కల్పించామని గుర్తు చేశారు. పలువురు కమ్యూనిటీ హాల్ కావాలని అడుగగా, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రూ.1,75,750 విలువ చేసే ల్యాప్‌ట్యాప్‌లు, టచ్ ఫోన్లు, వినికిడి యంత్రాలు అందజేశారు. 52 మంది దివ్యాంగ స్వయం సహాయ సంఘం సభ్యులకు రూ.72 లక్షలు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బెహరా మనో వికాస కేంద్రం నిర్వాహకులు శ్యామల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన సృష్టికర్త ఒక బ్రహ్మ లఘు నాటికను ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కె.కవిత, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్, డీఈవో వెంకటేశ్వరరావు, యూత్ కో-ఆర్డినేటర్ ఉజ్వల్, సెట్‌శ్రీ సీఈవో ప్రసా దరావు, మెప్మా పీడీ కిరణ్, డీపీఆర్వో కె.బాలమాన్ సింగ్, పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.