పాతపట్నం వైసీపీలో మరోసారి విభేదాలు
ABN , First Publish Date - 2023-05-25T23:48:40+05:30 IST
పాతపట్నం నియోజకవర్గం వైసీపీలో మరోసారి వర్గ విభే దాలు బయటపడ్డాయి.ఎమ్మెల్యే రెడ్డిశాంతి గురువారం సాయంత్రం చాపరలో వలంటీర్లకు సేవా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

మెళియాపుట్టి: పాతపట్నం నియోజకవర్గం వైసీపీలో మరోసారి వర్గ విభే దాలు బయటపడ్డాయి.ఎమ్మెల్యే రెడ్డిశాంతి గురువారం సాయంత్రం చాపరలో వలంటీర్లకు సేవా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి స్థానిక సర్పంచ్ బి.రామరావుతోపాటు, వైస్‌ఎంపీపీలు ఆదినాయుడు, ధనలక్ష్మితో పాటు వైసీపీకి చెందిన కొందరు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు డుమ్మాకొట్టి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో జాడుపల్లి సర్పంచ్ భర్త కన్నబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో శ్రీకాకుళం సమావేశం నిర్వ హించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మెళియాపుట్టి మండలంలో కొందరు తూర్పుకాపు కార్పొరేషన్ చెర్మన్ మామిడి శ్రీకాంత్‌కు మద్దతు పలికి ఎమ్మెల్యే వర్గా నికి షాక్ ఇస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే పలు సమా వేశాలకు వైసీపీ నాయకుల కంటే అధికారులే ఎక్కువ మంది హాజరవుతుండడం చర్చనీయాంశమవుతోంది. కాగా ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సైతం శ్రీకాంత్ వర్గానికి సమాచారం అందించకపోవడంతో హాజరుకావడం లేదా, సమాచారం అందినా అసంతృప్తితో వెళ్లడం లేదానన్న సందేహాలు నెలకొన్నాయి.