ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2023-02-21T23:49:48+05:30 IST

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బొర్రంపేట, ముంగెన్నపాడు గ్రామాలకు చెందిన కె.భాస్కరరావు, రాధాకృష్ణలతో పాటు మరి కొందరు రైతులు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పంట పొలాల్లో వరి చేను కుప్పలను నూర్పులు చేసి ధాన్యం సిద్ధం చేసినా ఇంత వరకు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయ లేదని, దీంతో ఇబ్బందులు పడుతు న్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

ఎల్‌ఎన్‌పేట: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బొర్రంపేట, ముంగెన్నపాడు గ్రామాలకు చెందిన కె.భాస్కరరావు, రాధాకృష్ణలతో పాటు మరి కొందరు రైతులు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పంట పొలాల్లో వరి చేను కుప్పలను నూర్పులు చేసి ధాన్యం సిద్ధం చేసినా ఇంత వరకు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయ లేదని, దీంతో ఇబ్బందులు పడుతు న్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్బీకేల వద్దకు వెళ్లి షెడ్యూల్‌ వేయాలని అడు గుతుంటే టార్గెట్‌ అయిపోయిందని సిబ్బంది చెబుతుండడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని వాపోయారు. ఈ సమస్యను డీటీ రషీద్‌ అహ్మద్‌కు రైతులు వివరించగా వ్యవసాయాధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియ జేశామని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-21T23:49:50+05:30 IST