30న విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా
ABN , First Publish Date - 2023-06-26T23:26:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామ పక్షాల ఆధ్వర్యంలో సోమవారం మందస బస్టాండు ఆవరణలో సంతకాలను సేకరించారు.
మందస: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామ పక్షాల ఆధ్వర్యంలో సోమవారం మందస బస్టాండు ఆవరణలో సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను దోచి కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తున్నాయ న్నారు. విద్యుత్ చార్జీల పెంపు సామాన్యుల పై భారం పడుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈనెల 30న విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు చాపర సుందర్‌లాల్, ఎన్.గణపతి, వంకల మాధవరావు, ఎం.రామారావు, జుత్తు వీరాస్వామి, మట్ట ధర్మారావు, పాల్గొన్నారు.