చంద్రబాబునాయుడితోనే అభివృద్ధి
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:59 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం అవసరమని... ఆయనతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందు తుందని జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఎ.రామకృష్ణ అన్నారు.
పలాస, డిసెంబరు 23: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం అవసరమని... ఆయనతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందు తుందని జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఎ.రామకృష్ణ అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా అంబుసోలి గ్రామంలో ఇంటింటా కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు.
వజ్రపుకొత్తూరు: నువ్వలరేవులో శనివా రం ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అబివృద్ధి, సంక్షేమం పూర్తి స్థాయిలో అమల వుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఉపాధ్య క్షుడు అరసవెల్లి ఉమామహేశ్వరరావు, కో ఆప్షన్ మాజీ సభ్యు లు నెయ్యిల సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆనంద్, వెంకటేష్, చొంపమ్మ పాల్గొన్నారు.