టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-06-11T23:55:45+05:30 IST

టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం చీపుర్లపాడు, వరహాలమ్మపేట ఊడికల పాడు గ్రామాల్లో పర్య టించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి
చీపుర్లపాడు మహిళలతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

త్వరలో అందరికీ మంచిరోజులు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఫ గ్రామాల్లో సమస్యలు వింటూ..

కోటబొమ్మాళి: టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మె ల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం చీపుర్లపాడు, వరహాలమ్మపేట ఊడికల పాడు గ్రామాల్లో పర్య టించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన నాలుగేళ్లుగా సమస్య వలయంలో కొట్టిమిట్టాడుతున్నామని, అభివృద్ధి, సంక్షేమం కరుమరుగయ్యాయన్నారు. గ్రామాల్లో కక్ష సాధింపు చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో నీటి, పారిశుధ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు మహిళలు, ఎత్తిపోతల పథకాలు పనిచేయడం లేదని రైతులు వివరిం చారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలనను అంత మొందించే సమయం ఆసన్నమైందని, త్వరలోనే అందరికీ మంచిరోజులు రానున్నా యన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, మాజీ ఎంపీ పీలు తర్ర రామకృష్ణ, వెలమల విజయ లక్ష్మి, నేతలు వెలమల కామేశ్వరరావు, సాసు మంతు ఆనందరావు, గొండు లక్ష్మణరావు, చిన్నారావు, కోరాడ గోవిందరావు, హనుమంతు అప్పలరాజు, రెడ్డి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T23:55:45+05:30 IST