రైలు నిలయం అభివృద్ధి చేయండి: ఎంపీ
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:51 PM
హరిశ్చంద్రపరం రైలు నిలయం అభివృద్ధి చేయాలని ఎంపీ కిం జరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. గురువారం హరిశ్చంద్రపురం రైల్ నిలయాన్ని వాల్తేరు డీఆర్‌ఎం సౌరౌవు ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎంకు రామ్మోహన్‌నాయుడు ఇక్కడ సమస్యలు వివరించారు.అంతంత మాత్రమే సౌక ర్యాలు ఉన్నాయని తెలియజేశారు.
కోటబొమ్మాళి: హరిశ్చంద్రపరం రైలు నిలయం అభివృద్ధి చేయాలని ఎంపీ కిం జరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. గురువారం హరిశ్చంద్రపురం రైల్ నిలయాన్ని వాల్తేరు డీఆర్‌ఎం సౌరౌవు ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎంకు రామ్మోహన్‌నాయుడు ఇక్కడ సమస్యలు వివరించారు.అంతంత మాత్రమే సౌక ర్యాలు ఉన్నాయని తెలియజేశారు. కాగా రూ.1.50లక్షలతో పుట్‌వే బ్రిడ్జి ఇప్పటికే మంజూరుచేశామని, సంక్రాంతికి ముందే భూమి పూజచేసి పనులు ప్రారంభిస్తామ ని డీఆర్‌ఎం హామీఇచ్చారు. రైలు నిలయానికి అప్రోచ్‌రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌ కర్యం, రెండో నెంబరు ప్లాంట్ ఫారంపై అదనం బుకింగ్‌కౌంటర్‌తోపాటు పలు వస తులను ప్రధానమంత్రి గతిశక్తి పథకంకింద ప్రత్యేక నిధులతో కల్పిస్తామని తెలిపారు. గుణుపూర్ పాసింజర్, విశాఖ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు కృషిగా రైల్వే బోర్డుకు సిఫారసు చేస్తానని హామీఇచ్చారు. రైలు నిలయం పరిధిలో గల 50 ఎకరాల్లో వ్యాపార సము దాయాన్ని నిర్మిస్తామని డీఆర్‌ఎం తెలిపారు.కార్యక్రమంలో విశాఖ డివిజన్ అసిస్టెం ట్ డీఆర్‌ఎం ఎస్‌కే గుప్త, డీసీఎం అవినాష్ శర్మ, తూర్పురైల్వే సీనియర్ డీఏఎం రమ ణ, డీఎస్పీ దేపాత్తు శర్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన రమేష్, మాజీఎంపీపీలు వెలమల విజయలక్ష్మి, తర్ర రామ కృష్ణ, టీడీపీ మహిళ అధ్యక్షురాలు పూజారి శైలజ, నేతలు వెలమల కామేశ్వ రరావు, సాసుమంతు ఆనందరావు, కర్రి అప్పారావు, నంబాళ్ల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.