డీజీపురం రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయండి
ABN , First Publish Date - 2023-06-26T23:30:46+05:30 IST
దండుగోపాలపురం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక యువత కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు లోతుగా ఉండడంతో ప్రయాణీ కులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ప్లాట్‌ఫారాలను ఎత్తు చేయాలని, అలాగే మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
సంతబొమ్మాళి: దండుగోపాలపురం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక యువత కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు లోతుగా ఉండడంతో ప్రయాణీ కులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ప్లాట్‌ఫారాలను ఎత్తు చేయాలని, అలాగే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దీనికి ఎంపీ స్పందిస్తూ.. ఇప్పటికే డీజీపురం స్టేషన్ లోని సమస్య లను రైల్వే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని, త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు. ఎంపీని కలిసిన వారి లో బెండి అరుణ్‌కుమార్, కూశెట్టి భానుప్రకాష్ ఉన్నారు.