పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి
ABN , First Publish Date - 2023-01-12T23:52:52+05:30 IST
పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వఓ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు.
సంతబొమ్మాళి: పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వఓ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. గురువారం డీజీ పురం పీహెచ్‌సీ పరిధిలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రజల్లో అవగహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న ఐరన్ మాత్రలు యాప్‌లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది ప్రతి రోజూ తప్పనిసరిగా రోజుకు మూడుసార్లు ముఖహాజరు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సునీల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.