ఉపాధి నిధులు తగ్గింపు అన్యాయం

ABN , First Publish Date - 2023-05-26T00:04:11+05:30 IST

ఉపాధి హామీ ప థకానికి నిధులు తగ్గించడం అన్యా యమని ఏపీ వ్య వసాయ కార్మిక సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు.

ఉపాధి నిధులు తగ్గింపు అన్యాయం
నిరసన తెలుపుతున్నఆందోలనకారులు

అరసవల్లి: ఉపాధి హామీ ప థకానికి నిధులు తగ్గించడం అన్యా యమని ఏపీ వ్య వసాయ కార్మిక సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏటేటా ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ వస్తోందని విమర్శించారు. ఆహార భద్రత కోసం గత ఏడాది బడ్జెట్‌లో రూ.2.27లక్షల కోట్లు కేటాయించగా 2023లో రూ.1.97 లక్షల కోట్ల కుదించడం అన్యాయమన్నారు. సీఐటీయూ నాయకులు కె.సూరయ్య, టి.తిరుపతిరావు, పి.రమ, ఆర్‌.అమల, రాజేశ్వరి, బి.ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:04:11+05:30 IST