Share News

మృతుడు.. యారబాడు వాసే

ABN , First Publish Date - 2023-11-06T23:43:45+05:30 IST

గార మండలం కూర్మనాథపురం వద్ద మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి.. నరసన్నపేట మండలం యారబా డు గ్రామానికి చెందిన చోడి రమణ(40) కుటుంబ సభ్యులు గుర్తించారు.

మృతుడు.. యారబాడు  వాసే

నరసన్నపేట: గార మండలం కూర్మనాథపురం వద్ద మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి.. నరసన్నపేట మండలం యారబాడు గ్రామానికి చెందిన చోడి రమణ(40) కుటుంబ సభ్యులు గుర్తించారు. సోమవారం పత్రికల్లో వచ్చిన ఫొటోతో వచ్చిన కథ నాన్ని చూసి బంధువులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమా చారం ఇచ్చారు. రమణ వారం రోజుల కిందట అనారోగ్యానికి గురికావడంతో చికిత్సకోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ.. రమణ ఆసుపత్రి నుంచి రెండు రోజుల కిందట పరారీ అయి గార మండలంలో కూర్మనాథపురం వద్ద కాలువల్లో విగతజీవిగా కనిపించాడు. రమణకు భార్య సంధ్యరాణి, కుమారులు దుర్గారావు, సంతోష్‌ ఉన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

రణస్థలం: ముక్తుంపురం గ్రామానికి చెందిన కాకి రమణ(27) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సుల వివరాల మేరకు.. రమణ, భవానీకి రెండేళ్ల కిందట వివా హం జరిగింది. అప్పటి నుంచి వీరి మధ్య నిత్యమూ చిన్నచిన్న వివాదాలు జరిగేవి. అయితే రమణ భార్య భవాని ఏడాదిగా తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది. భార్య భవాని తనకు దూరంగా ఉంటుందని, మానసిక ఆవేదనకు గురై ఆదివారం రాత్రి రమణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం రమణ కుటుంబ సభ్యులు చూసేసరికి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కాకిత రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌ పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేశారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

శిష్టికరణ సంఘం గౌరవ అధ్యక్షుడు మృతి

రణస్థలం: మండల శిష్టికరణ గౌరవ అధ్యక్షుడు రేగులవలస రాజగోపాలరావు (85) సోమవారం తెల్లవారి జామున మృతి చెందారు. శిష్టికరణం సమస్యలపై పోరాటం చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు. పశు వైద్యాధికారిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ అయ్యారు. అదేవిధంగా గ్రామీణ వైద్య సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

పట్టాలు దాటుతుండగా వివాహిత..

ఆమదాలవలస: స్థానిక రైల్వేస్టేషన్‌ (శ్రీకాకుళం రోడ్డు) సమీపంలో సోమవా రం ఆమదాలవలస మునిసిపాలిటీలోని చంద్రయ్యపేటకు చెందిన వివాహిత అనంత పట్నాయకుని లీలారాణి(47) పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లీలారాణి ఉదయం 6.20 గంటల సమయంలో పట్టాలు దాటుతుండగా, ఆ సమయంలో పలాస- విశాఖ డీఎంయూ పాసింజర్‌ వెనుక నుంచి వస్తున్న విషయాన్ని లీలారాణి గమనించలేదు. దీంతో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2023-11-06T23:43:46+05:30 IST